< 1 Min

Khawaja Asif: భారత్‌పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు…

భారత్‌పై కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ మరోసారి మితిమీరిన వ్యాఖ్యలు చేస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ దాడులను ఎదుర్కొంటున్న పాక్ ఇప్పుడు భారతదేశంపైనా యుద్ధభాషణతో ముందుకు వచ్చింది.

తాజాగా జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ…, “పాక్ రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉంది. భారత్ సరిహద్దులో డర్టీ గేమ్ ఆడుతోంది. ఇప్పటికే యుద్ధ వ్యూహాలు సిద్ధం చేశాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం” అని పేర్కొన్నారు.

ఆసిఫ్ ప్రకటనలు పాక్‌లోనే కాక అంతర్జాతీయంగా కూడా చర్చకు దారి తీసాయి. ఆయన ఆఫ్ఘనిస్థాన్, భారత్ పాకిస్థాన్‌పై అనుచితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమని, అవసరమైతే భారతదేశంపైనా దాడులు చేస్తామని హెచ్చరించారు.

ఇక పాక్–ఆఫ్ఘన్ మధ్య ఇటీవలి ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రకారం పాక్ సైనికులు లొంగిపోయారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశంపై తాలిబాన్లకు మద్దతు ఇస్తోందని చేసిన ఆసిఫ్ ఆరోపణలు దౌత్యపరంగా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పాకిస్థాన్ అంతర్గత అస్థిరత నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.