< 1 Min

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9 ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడ మాధురి, రమ్య మోక్ష లాంటి కంటెస్టెంట్లు హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్న నటి రేఖ భోజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రేఖ భోజ్ పలు షార్ట్ ఫిలిమ్స్, కొన్ని సినిమాల్లో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నా కెరీర్ ప్రారంభంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. నా బంగారుగాజులు కవర్ సాంగ్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ సాంగ్ వల్లే మాంగళ్యం సినిమాలో అవకాశం దక్కింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి కానీ కొంతమంది నిర్మాతలు అనుచితమైన కమిట్మెంట్స్ అడిగారు. అలాంటి వారికి గట్టిగా సమాధానం చెప్పాను” అని తెలిపింది.

అలాగే ఆమె, “నాతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను స్వయంగా ఓ సినిమా చేయాలనుకుంటున్నా. అవసరమైతే నా కిడ్నీ అమ్మినా సినిమా చేస్తా. పాపులారిటీ కోసం నాలుగేళ్లుగా బిగ్ బాస్‌లోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నా. గత ఏడాది ఫైనల్ రౌండ్ వరకు వెళ్లాను కానీ చివర్లో రిజెక్ట్ చేశారు. ముక్కు మొహం తెలియని వారిని తీసుకుంటున్నారు. నాకు అవకాశం ఇచ్చి ఉంటే దాన్ని బాగా వాడుకునేదాన్ని” అని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది.