నువ్వు చేసేపని ఎంతమంది చూస్తారన్నది కాదు ముఖ్యం. అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు . మంచితనం కనబడితే చాలు.
మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి.
కష్టపడుతు పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది . ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది.
అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది
తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది
కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది