ఓం విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం గురుభ్యోన్నమః

మురారిణా సుపూజితాం సురారిణం వినాశినీం
గదేషు చాపధారిణీం మరాళ మందగామినీం
సుచారుహాస భాసినీం మదాలసాం మదంబికాం
ముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం॥ – 1

ఉమా రమాది దేవలోక భామినీ సుపూజితాం
సురేశ్వరీం జనేశ్వరీం గణేశ్వరీం భవేశ్వరీం
చరాచరాది సర్వలోక రక్షణే కృతోద్యమాం
ముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం॥ – 2

నిశుంభ శుంభ భంజనీం సదామరారి నాశినీం
మృకండుసూనుకీర్తితాం మృదంగ నాదతోషితాం
మునీశ్వర ప్రపూజితాం తమాల నీలకుంతలాం
ముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం||. – 3

కరేవిరాజితాంబుజాం గణేసువర్ణభూషణం
సుతారహారమౌక్తికాది భూషితాంగభాసినీం
సుకోటికోటి సూర్యకాంతి భాసురాంగవైభవాం
ముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం||. – 4

త్రిలోక పాలవందితాం త్రిలోచనైక భామినీం
కిరీట కోటి రత్నకాంతి మంజుల ప్రభాయుతాం
సుధా సముద్రవాసినీం గిరీంద్ర సానుచారిణీం
ముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం॥ – 5

సదా సుదుర్గ దుర్గ నామకీర్తనం సుఖావహం
నవార్ణమంత్ర జాపనం అనేక దుఃఖవారణం
అనేక తాపహారకం అనేక పాపనాశకం
ముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం॥ – 6

భుజంగ భూష భూషితాంగ భూషణాం సుభాషిణీం
అనేక మంత్ర భాసినీం అనేక యంత్ర రూపిణీం
అనేక తంత్ర భాసితాం అనేక రూప ధారిణీం
ముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం॥ – 7

నవాంబుజే విరాజితాం మృగేంద్ర వాహనప్రియాం
కరాంబుజేషు శంఖ చక్ర భూషితాం త్రిశూలినీం
హిమాలయే కృతాలయాం మమాంతరంగ భావితాం
ముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం॥ – 8

త్రిలోక విశ్వసుందరీం త్రికోణ బిందు వాసినీం
సులోచనాం సువాసినీం సువర్ణ వర్ణభాసినీం
పదేపదే 2 నుచింతయామి సర్వలోకమాతరం
ముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం!! – 9

” ఓం తత్సత్ ” బ్ర॥శ్రీ సరాబు మందిరం వేంకటేశ్వర శర్మ విరచితం నవరత్న మహేశ్వరీ స్తోత్రం సంపూర్ణం

నవదుర్గా సేవా సమితి, జగిత్యాల.