< 1 Min

ఈ నెల 16న కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం పరిధిలో సగం కాలిన ఒక యువకుడి మృతదేహం లభించింది. దర్యాప్తులో భయంకరమైన నిజాలు బయటపడాయి.

వివరాల్లోకి వెళ్ళితే …

ఈ యువకుడిని పోలీసులు ముందుగా గుర్తించలేదు. ఘటన స్థలం చద్మల్ రోడ్డుకు పక్కన గుంతల్లో ఆయన శవం కనిపించింది. పోస్టుమార్ట్‌మెంట్, సీసీ ఫుటేజ్ పరిశీలన అనంతరం భవానీనగర్, నారాయణపేట, కీసర మండలం (మెద్చల్ జిల్లా) నరేష్ గా గుర్తించారు.

నరేష్ కు 2012 లో నవనీత తో కీసర మండలంలో వివాహం జరిగింది. ఇద్దరూ కూలీ పనులు చేస్తూ జీవించేవారు. ఆ తర్వాత నవనీతకు ఆమె దగ్గర బంధువుగా ఉండే ఆంజనేయులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ విషయం తెలిసిన నరేష్ భార్యను మందలించాడు. ఈ విషయం నవనీత ఆంజనేయులకు చెప్పింది. ఆంజనేయులు నరెష్‌కి ఫోన్ చేసి “పెద్దగుట్ట దర్శనానికి కలిసి వెళదాం” అంటూ ఈ నెల 15న రాంపల్లి చౌరస్తా వద్దకు రమ్మన్నాడు, అక్కడి నుంచి బైకుపై బయలుదేరి, పెద్దగుట్ట దర్శనం చేసుకున్నారు.

అనంతరం మత్తులో ఉన్న నరెష్‌పై ఆంజనేయులు దాడి చేసి చంపేశాడు. తరువాత శవాన్ని ఎవరికీ గుర్తించరాదు అన్న ఉద్దేశ్యంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికుల సమాచారం ఆధారంగా గాంధారి పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని శవం కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో సీసీ ఫుటేజ్, ఫోర్స్ పరిశీలనలు చేసి నరేష్ హత్యకి సంబంధించిన పూర్తి స్థాయి తుది వివరాలు వెల్లడయ్యాయి. అనంతరం ఆంజనేయు మరియు నవనీతను అరెస్ట్ చేశారు అని SP రాజేశ్ చంద్ర బుధవారం వెల్లడించారు.