< 1 Min

Missile Shield: రక్షణ కవచ వ్యవస్థల్లో పోటీ పడుతున్న దేశాలు…

ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్‌’ యావత్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇరాన్‌, హిజ్బోల్లా రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేసే ఈ వ్యవస్థ దేశ భద్రతలో ఎంత కీలకమో ప్రపంచానికి స్పష్టమైంది.

అమెరికా కూడా 175 బిలియన్ డాలర్లతో గోల్డెన్ డోమ్‌ను అభివృద్ధి చేయాలని ప్రకటించింది, కానీ అది పరిమిత ప్రాంతంలో మాత్రమే రక్షణ ఇస్తుంది. అదే సమయంలో, చైనా అధునాతన డోమ్ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది, ఇది భూతలం, గగనతలం, సముద్రతలం అంతటా క్షణాల్లో క్షిపణులు, రాకెట్లు, యుద్ధ విమానాలను గుర్తించి కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందిస్తుంది.

ఇజ్రాయెల్‌కు ఐరన్ డోమ్‌, అమెరికాకు గోల్డెన్ డోమ్‌, చైనాకు మిస్సైల్ డిఫెన్స్ డోమ్ ఉంటే, భారత్‌కు ప్రస్తుతం 30 కిమీ పరిధి, 18,000 మీటర్ల ఎత్తులో వచ్చే ప్రమాదకర వస్తువులను ఛేదించే ‘ఆకాశ్’ వ్యవస్థ ఉంది. 2035 నాటికి ‘సుదర్శన చక్ర’ అనే అత్యాధునిక రక్షణ వ్యవస్థ ద్వారా దేశ భద్రత మరింత పెరుగుతుంది.