< 1 Min

భార్య మీద కోపంతో అత్తగారింటినే తగలబెట్టాడు ఓ యువకుడు. ఈ దారుణ సంఘటన కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్ళితే…

జైనూరు మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్ అనే యువకుడు ఎల్లాటాపార్‌కు చెందిన షమాబీ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ముజాహిద్‌కు ఆమెను పెళ్లి చేసుకోవడంతో ఇష్టం లేకపోవడంతో భార్యతో గొడవకు దిగాడు. దంపతుల మధ్య వివాహం జరిగినప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా గత 20 రోజుల క్రితం షమాబీ తన పుట్టింటికి వెళ్లగా తను కూడా అత్తారింటికి చేరుకొని భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో గ్యాస్ సిలిండర్ లీక్ చేసి ఇంటికి నిప్పంటించి వెళ్లిపోయాడు.

ఇల్లు పూర్తిగా దహనమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.