హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో రూ.750 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని ‘హైడ్రా’ స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్ 403లో ఉన్న భూమిని నకిలీ పత్రాలతో వీఆర్ ఇన్ఫ్రా యజమాని పార్థ సారథి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు.
అధికారులు విచారణకు వస్తే బౌన్సర్లు, వేటకుక్కలతో బెదిరింపులకు దిగేవారని సమాచారం. జలమండలి, రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు హైడ్రా భారీ పోలీసు బందోబస్తుతో అక్రమ నిర్మాణాలను కూల్చి భూమిని రక్షించింది.
ఈ ఘటనపై పార్థ సారధిపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా గాజుల రామారంలో మూడున్నర ఎకరాలు, మేడ్చల్లో మూడు ఎకరాలు, అబ్దుల్లాపూర్మెట్లో 680 గజాల పార్కు భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది.