< 1 Min

హైదరాబాద్‌లోని జెఎన్‌టియు హాస్టల్‌లో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి భానోతు రవీందర్ నాయక్ (21) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా మోతె మండలం పెద్దరాజు తండాకు చెందిన రవీందర్, జెఎన్‌టియులో చదువుకుంటూ హాస్టల్‌లో ఉండేవాడు. గురువారం రాత్రి తన గదిలో ఉరివేసుకున్న అతడిని సహ విద్యార్థులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రవీందర్ ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ, కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.