< 1 Min

PM Modi Srisailam Darshan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం శ్రీశైలంకు చేరుకుని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న మోడీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు.

అనంతరం సైనిక హెలికాఫ్టర్‌లో శ్రీశైలంకు వెళ్లి భ్రమరాంబ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత 12:10 నుంచి 12:35 వరకు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి, 12:40కి తిరిగి అతిథి గృహానికి చేరుకున్నారు.

మధ్యాహ్నం 1:20కి శ్రీశైలంనుంచి బయల్దేరి సుండిపెంట హెలిప్యాడ్ చేరుకుని, 2:20కి కర్నూలు చేరుకున్నారు. 2:30కి నన్నూరు సమీపంలోని రాగమయూరి వెంచర్ సభాస్థలికి చేరుకుని సభలో పాల్గొననున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 400 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 3 లక్షల మంది హాజరుకానున్నారు. రూ.13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో విద్యుత్ ప్రసార వ్యవస్థ, పారిశ్రామిక అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులు, గ్యాస్ పైప్‌లైన్‌, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ప్రధానమైనవి.