< 1 Min

హైదరాబాద్‌లో ఓ సంచలన ఘటన వెలుగుచూసింది. మధురానగర్‌లో ఇంటి యజమాని అశోక్‌, ఎలక్ట్రీషియన్‌ చింటూతో కలిసి అద్దె ఇంటి బాత్‌రూమ్‌లో బల్బు హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చాడు.

అద్దెకుంటున్న దంపతులు అక్టోబర్ 13న కెమెరాను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో యజమాని అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చింటూ పరారీలో ఉండగా, పోలీసులు అతనిని గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను కలవరపరుస్తోంది.