< 1 Min

నక్కతోక తొక్కిన మత్స్యకారుడు… అదృష్టం అంటే అలానే ఉంటుంది…

ఒడిశా – పశ్చిమ బెంగాల్ సరిహద్దు దిఘా సమీపంలో ఆదివారం ఉదయం ఓ మత్స్యకారుడి వలలో 90 అరుదైన ‘టెలియా భోలా’ చేపలు పడ్డాయి. ఒక్కో చేప బరువు 30–35 కిలోలు, మొత్తం మార్కెట్ విలువ దాదాపు కోటి రూపాయలుగా ఉంది.

కోల్‌కతాకు చెందిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ చేపలను కొనుగోలు చేసింది. టెలియా భోలా చేపల నూనె, శరీర భాగాలు ప్రాణరక్షక మందుల తయారీలో ఉపయోగిస్తారు.

ఈ చేపలు సాధారణంగా లోతైన సముద్రంలో లభిస్తాయి. గత సంవత్సరం, ఈ ప్రాంతంలో 1.99 క్వింటాళ్ల బరువు కలిగిన 9 అరుదైన చేపలు ఒక్కొక్కటి రూ.15 లక్షలకు అమ్మబడ్డాయి. స్థానికులు వీటిని చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.