తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్‌ 2025 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.

ఈ పరీక్షలో 54,692 మంది విద్యార్థులు హాజరుకాగా, 93.83% మంది అర్హత సాధించారు. మొత్తం 44 సబ్జెక్టుల పరీక్షల్లో 51,317 మంది ఉత్తీర్ణులయ్యారు. కన్వీనర్‌ కోటా కింద 253 కాలేజీలలో 41,709 సీట్లు భర్తీ చేయనున్నారు.

కౌన్సెలింగ్ సెప్టెంబర్‌ 10 నుంచి మొదలై, వెబ్ ఆప్షన్ల నమోదు 18 నుంచి 20 వరకు, సీట్ల కేటాయింపు సెప్టెంబర్‌ 24న, కళాశాలలో రిపోర్టింగ్‌ సెప్టెంబర్‌ 27లోపు జరగనుంది.

అలాగే ఏపీ PGSET 2025 కౌన్సెలింగ్ సెప్టెంబర్‌ 8 నుంచి ప్రారంభమైంది. తొలి విడత రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్‌ 15 వరకు కొనసాగుతాయి.

ధ్రువపత్రాల పరిశీలన సెప్టెంబర్‌ 9 నుంచి 16 వరకు, వెబ్ ఆప్షన్ల నమోదు 12 నుంచి 17 వరకు చేపడతారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్‌ 20న జరుగగా, విద్యార్థులు 22 నుంచి 24లోపు కళాశాలల్లో హాజరుకావాలి. అనంతరం రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.