మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:8 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా, చెన్నూర్ లో అమృత్ 2.0 పథకంలో నీటి ట్యాంకు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న అమృత్ 2.0 నీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
మిషన్ భగీరథ పథకంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా త్రాగునీటిని అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి నీటి సమస్య లేకుండా అమృత్ 2.0 పథకం ద్వారా త్రాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ పథకం లో భాగంగా చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
