✍️దుర్గా ప్రసాద్
ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశానికి పాల్వంచ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల, వాగాటిల ను సత్కరించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇంచార్జ్ మంత్రి వాగాటి శ్రీహరి లు హాజరయ్యారు.
పాల్వంచకు వచ్చిన మంత్రులకు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు నాయకత్వంలో మంత్రులకు స్వాగతం పలికారు. మంత్రులను శాలువ, బొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా స్టాల్స్ ను కొత్వాల పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, నాయకులు వై వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, పైడిపల్లి మహేష్, కందుకూరి రాము, ఉండేటి శాంతి వర్ధన్, మాలోత్ కోటి నాయక్,చింతా నాగరాజు,వాసుమల్ల సుందర్రావు, డిష్ నాగేశ్వరరావు, సామ వెంకటరెడ్డి, ధారా చిరంజీవి, పాకాలపాటి రోశయ్య చౌదరి, బండి నాగరాజు, ధర్మసోత్ ఉపేందర్ నాయక్, పిట్టల రామారావు, ఇజ్జగాని రవి గౌడ్, సాంబయ్య, జీవీ రత్నం, అరుణ రెడ్డి, ఎం భవాని, రఫీ తదితరులు పాల్గొన్నారు.
