✍️దుర్గా ప్రసాద్

అసెంబ్లీ ఓటర్ జాబితా నుండి పాత్ వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి నాగలక్ష్మి (జెడ్పి-సీఈవో) గారు సూచించారు. ఈరోజు ఎంపీడీవో విజయభాస్కర రెడ్డి గారితో కలిసి కేశవాపురం, బసవతారక కాలనీ గ్రామపంచాయతీల నందు తయారుచేసిన ఓటర్ జాబితాను పరిశీలించడం జరిగింది. గ్రామపంచాయతీ కార్యదర్శులు ఓటరు జాబితాను జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా తయారు చేయాలని తెలిపారు.

అనంతరం నర్సరీ లను పరిశీలించి మొక్కలను వారం రోజులలో నాటాలని, చిన్న మొక్కలు టాల్ ప్లాంట్ కన్వెన్షన్ కు ఉంచుకోవాలని సూచించారు. కమ్యూనిటీ ప్లాంటేషన్, కమ్యూనిటీ సోక్ పిట్ పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపీఓ పోరండ్ల రంగా, కార్యదర్శులు కృష్ణవేణి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.