మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:24 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
టిడిపి జెండాను తొలగించిన వారిని పట్టుకొని శిక్షించాలి.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని 27వ వార్డు హనుమాన్ బస్తీ చౌరస్తా గ్రంథాలయం ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కి చెందిన జెండాను బూడిది గడ్డ నీళ్ల ట్యాంకి దగ్గర వినాయక మండపానికి దగ్గర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను, గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు.
ఈ ఘటనపై టిడిపి పట్టణ అధ్యక్షులు టి. మణిరామ్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం స్థాపించిన పార్టీ జెండాలను తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడితో సమానమే అని అన్నారు.
ఏ పార్టీ వారైనా ప్రజల సంక్షేమం గురించి పని చేసేందుకు పోటీ పడాలే తప్ప పార్టీ జెండాలను తొలగించడం సరి అయినది కాదని, వెంటనే నిందితుడిని గుర్తించి పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. అక్కడ ఉన్న చౌరస్తాలో సిసి పుట్టేదులను పరిశీలించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని వారు ఈ సందర్భంగా కోరారు.
టిడిపి కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని నిరసనలు వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు టి మణి రామ్ సింగ్, ఉపాధ్యక్షులు బొల్లు మల్లయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి ఓ జీవరత్నం, మండల ఉపాధ్యక్షుడు గద్దెల నారాయణ, సిహెచ్ రమేష్, ఏం గోపాల్, బి.సత్యనారాయణ, గైని తిరుపతి, ఎస్.కె అస్గర్ భాష, ఆర్ గంగాధర్ గౌడ్, కొత్తూరు నారాయణ, మేకల రాజయ్య, ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి హసన్, ఎస్ రవి, మేకల నర్సింగ్, పోతుల రాములు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
