భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ,
06,ఆగష్టు,2025.
✍️దుర్గా ప్రసాద్
స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన గొప్ప ధీశాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ — తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి.
స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన గొప్ప ధీశాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఉద్యమకారులు కొనియాడారు.తెలంగాణా జాతిపిత, తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 91 వ జయంతి వేడుకలు పాల్వంచ ఉద్యమకారుల ఆధ్వర్యంలో బుధవారం బుడగం నాగేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటే ఆయన జీవిత లక్ష్యం గా ముందుకు సాగారని, తెలంగాణ అస్తిత్వం కోసం జీవితకాలం పని చేసారని గుర్తు చేసుకున్నారు. ఈయన మొట్టమొదట 1952 లోనే ప్రత్యేక తెలంగాణా కోసం పోరాటం చేసారని,నదిజలాల వాటాల పంపిణీలో తెలంగాణ కు జరుగుతున్న అన్యాయం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రావాలని కోరుకున్నారని అన్నారు. జయశంకర్ సార్ గొప్ప విద్యావేత్తని, కాకతీయ విశ్వవిద్యాలయం నకు వైస్ ఛాన్సలర్ గా విధులు నిర్వహించారని తెలిపారు. ఆయన ఆశయాలు సాధించినపుడే మనం ఆయనకు ఇచ్చే గొప్ప నివాళి అని అన్నారు. జయశంకర్ సార్ జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆయన జీవిత చరిత్రను, త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేసారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రషీద్, బరగడి దేవదానం, నబీ సాహెబ్, రవూఫ్, శ్రీ పాద సత్యనారాయణ, శనగ వెంకటేశ్వర్లు, యస్.డీ.టీ హుస్సేన్, కుడికాల ఆంజనేయులు, గొడ్ల మోహన్ రావు, ఉబ్బన శ్రీను, వీరభద్రం, బాషా, బాబా, శనగ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………..
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
