భద్రాద్రికొత్తగూడెం జిల్లా
ములకలపల్లి మండలం
✍️దుర్గా ప్రసాద్
ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాజీ గూడెం గ్రామం అనే అడవిప్రాంతంలో ఛత్తిస్గడ్ నుండి సుమారు 60 కుటుంబాలు వలసవచ్చి జీవనం కొనసాగిస్తున్నారు, వారు వలసవచ్చి సుమారు 20సంవత్సరాలు అవుతుందని తెలంగాణాలో అన్ని అర్హతాలు ఉన్నప్పటికీ మా గ్రామానికి ఎలాంటి రోడ్డుj సౌకర్యం లేదు, కాలిబాటనే నడుస్తున్నామని తెలిపారు. కరెంట్, మంచినీటి సాకర్యలు, పిల్లలు చదువు కోవడానికి బడి లేకపోవడంతో ఎలాంటి సౌకర్యలకు నోచుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు.
కరెంట్ లేక అంధకారంలోనే జీవనం సాగిసున్నామ కొన్ని సంవత్సరాలు పేటచెరువు పరిసర అడవిప్రాంతంలో ఉంటున్నక్రమంలో పాముకరిచి అమ్మాయి చనిపోయిన సంఘటనలు ఉన్నాయని వాపోయారు. చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నామని అన్నారు. ఆ గ్రామానికి చెందిన సిద్దు అనే యువకుడు నారాయణ సేవా సమితి వారికి కలిసి ఆ ఊరి బాధలు వివరించారు.
మానవతా దృక్పకదంతో వెంటనే స్పందించిన పాల్వంచ కు చెందిన నారాయణ సేవ సమితి సభ్యులు 60 కుటుంబాలకు సరిపోను చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ దుస్తులు పంపిణి, ఒక్కొక్క కుటుంబానికి 5 కిలోల బియ్యం మంచి నూనె ప్యాకెట్ ఉల్లిపాయలు పసుపు కారం, ఉప్పు ,మరియు వంటకి కావలసిన వంట పాత్రలు పంపిణి చేశామనిచేసి మానవత్వం చాటుకున్నారు. ఎందుకు గాను ప్రజలు వారికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా వార్తకసంఘం కన్వీనర్ చలవాది ప్రకాష్ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ద్రుష్టి సారించి వారిసమస్యలను తెలుసుకొని వారికీ వారికీ అవసమైన మౌలిక సదుపాయాలు కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు
ప్రాథమిక పాఠశాలను నిర్మించాలి
ప్రాథమిక హక్కులైన విద్య వైద్యం కలిపించాలని అదే తరుణంలో ధర్మాజీగూడెం గ్రామంలో సుమారు 25మండి బడిడు పిల్లలు వున్నారని, ఇక్కడి పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే ఎక్కడో అడవిలో సరైన రహదారి లేని మార్గంలో మూడు కిలోమీటర్లు మేర వెల్లి రావాల్సివాస్తుందని,వెళ్లి వచ్చే క్రమంలో పాములు, తెల్లు కుట్టి ప్రాణాలు పోయే ప్రమాదం లేకపోలేదు ఇదే గ్రామంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాలని ఆదివాసీ ప్రజలు కోరుతున్నారు.
జిల్లా కలెక్టర్ స్పందించాలి
జిల్లా కలెక్టర్ కూడా ఆదివాసీ గ్రామాలను సందరంచి కనీస మౌలిక వసతులు కల్పించి ఆర్థిక భరోసా కల్పించి ఆడుకోవాలని, ఈ సందర్బంగా కోరుతున్నామని తెలిపారు.మంచినీళ్లు లేవు రోడ్లు లేవు,కరెంటు లేదు అందకరంలోనే బ్రతుకుతున్నారు. కానీసఅంమౌలిక వసతులు వెంటనే కల్పించి వారిని అన్నిరకాలుగా ఆడుకోవాలని ఈ సందర్బంగా కోరుతున్నాన్నారు.
కార్యక్రమంలో నారాయణ సేవ సమితి అధ్యక్షులు
మాలే రాజేష్, వర్తక సంఘం కన్వీనర్ చలవాది ప్రకాష్, నారాయణ సేవా సమితి సభ్యులు, వసుంధర రామ, కొప్పరపు నగేష్,గుండా రజనీకాంత్, బచ్చు శ్రీనివాస్,
డోగిపర్తి సతీష్, కేశ శ్రీనివాస్, పాల్గొన్నారు
