భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాత పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పల్లకి మోసి, బోనమెత్తిన కొత్వాల – వివిధ దేవాలయాల నుండి అమ్మవారికి చీరె – సారె
పాత పాల్వంచ గడియకట్ట లోని పేరొందిన మైసమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ మాసము మొదటి ఆదివారం బోనాలు ఘనంగా జరిపారు. ఆదివారం ఉదయం నుండే ఆలయ పూజారి పురాణం పవన్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలా దేవి దంపతులు పూజలు చేశారు.
పాత పాల్వంచ దేవాలయాల నుండి అమ్మవారికి చీరె – సారె
మైసమ్మ తల్లి బోనాలు సందర్బంగా పాతపాల్వంచలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, షిర్డీ సాయి బాబా దేవాలయాల నుండి పూజారులు కందాల ఆనంద కుమారాచార్యులు, దినకరశాస్త్రి, సతీష్ కుమార్ ల ఆధ్వర్యంలో అమ్మ వారికి చీరె – సారె సమర్పించారు.
పల్లకి మోసి బోనమెత్తిన కొత్వాల
శ్రావణమాసపుబోనాల సందర్బంగా పాత పాల్వంచ మహిళలతో కలిసి DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అమ్మవారి పల్లకి మోసారు. బోనమెత్తుకుని అమ్మవారికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ క్రాంతి మురారి, మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, కమిటీ సభ్యులు వంగా రమేష్, మసనం శరత్, కోసూరి కిరణ్ కుమార్, రౌతు మల్లేష్, కరుకుల సతీష్, గడదాసి వెంకటేష్, ముత్యాల కోటేశ్వరరావు, అగ్నిమండల భాస్కర్, బర్ల పాపారావు, గుగులోత్ మంగ్యానాయక్, పాశం నాసరయ్య, బొందిల శేషగిరి రావు, ఎనగందుల సాంబయ్య, కిలారి భవానీశంకర్, బట్టు లింగయ్య, నర్శిరెడ్డి, శంకర్ రెడ్డి, మణికంఠ, భాగం రాంబాయమ్మ, లక్ష్మణ్, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పైడిపల్లి మహేష్, కందుకూరి రాము, ఉండేటి శాంతి వర్ధన్, చిన్నపండు తదితరులు పాల్గొన్నారు.
