భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారు ప్రజలందరిని అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

ఇంతకుముందు మణుగూరు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇప్పటికైనా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నివసించే వారు, పెద్దలు, చిన్నలు అన్ని జాగ్రత్తలతో ఉండాలని పిలుపునిచ్చారు.

అధికార యంత్రాంగం సమయానికి స్పందించాలని కోరుతూ, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తక్షణం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు అందరూ సహకరించాలని కోరారు.

BRS పార్టీ జిల్లా అధ్యక్షులు
శ్రీ రేగా కాంతారావు గారు