మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
లోటస్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లోని లోటస్ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరియు ముందస్తు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో విద్యార్థిని, విద్యార్థులు స్వాతంత్ర సమరయోధులు,కృష్ణ,గోపిక వేషధారణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శేషు కుమార్ మాట్లాడుతూ… పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో చదువు తో పాటు సంస్కారం అంతే ముఖ్యం. భారత దేశ సంస్కృతిని పిల్లలకు తెలియపరిచే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. పిల్లల తల్లి తండ్రులు కూడా పూర్తిగా సహకరించి పాఠశాల యాజమాన్యాన్ని ఉత్సాహపరుస్తున్నందుకు లోటస్ యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహేష్, కల్పన, ఉపాధ్యాయునిలు, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లి తండ్రులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
