దేశవ్యాప్తంగా మార్కెట్ పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా, మరోవైపు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ధరలు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు గురవుతున్నాయి. భారత్‌లో పన్నుల పెంపు తర్వాత బంగారం ధరలు పెరిగినా, ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. దీంతో వారాంతంలో గోల్డ్ కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

2026 మే 23న దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మే 22తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.43 తగ్గినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. దీంతో Hyderabad, Warangal, Nizamabad, Khammam, Vijayawada, Visakhapatnam, Tirupati, Kadapa నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర రూ.15,906గా కొనసాగుతోంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,580గా నమోదైంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే, మే 23న దేశవ్యాప్తంగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.295గా ఉంది.

మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో కొనుగోలుదారులు ధరలను పరిశీలించి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, పన్నుల మార్పులు, డిమాండ్ ఆధారంగా రాబోయే రోజుల్లో ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.