2

సంఘటనలు

1893: ఎక్సెల్సియర్ అనే పేరు గల వజ్రాన్ని (నీలం – తెలుగు రంగు 995 కేరట్స్ బరువు) కనుగొన్నారు.

1914: మహాత్మా గాంధీ ని, దక్షిణ ఆఫ్రికా లో, భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్టు చేసారు.

1996: 1996 యూరోకప్ ఫుట్‌బాల్ ట్రోఫీని జర్మనీ జట్టు గెలిచింది.

1935: ఆస్టరాయిడ్#1784 (బెన్గెల్లా) ని సి.జాక్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.

1936: మార్గరెట్ మిచెల్ వ్రాసిన నవల గాన్ విత్ ద విండ్ ముద్రించారు.

1936: ‘వారానికి నలభై గంటల పని విధానాన్ని’ అమలు చేసే ఫెడరల్ చట్టాన్ని అమెరికాలో అమలు చేయడం జరిగింది.

1940: డాల్ మెస్సిక్ తయారు చేసిన బ్రెండా స్టార్ అనే కార్టూన్ స్ట్రిప్ మొదటిసారిగా కనిపించింది.

1948: రేడియోలో వాడే ట్యూబులకి బదులుగా ట్రాన్సిస్టర్స్ని వాడవచ్చునని బెల్ లాబరేటరీస్ ప్రకటించింది.

1960: జైరీ (పూర్వపు బెల్జియన్ కాంగో) అనే దేశం, బెల్జియం నుంచి స్వాతంత్ర్యం పొందింది.

1962: రువాండా, బురుండీ అనే రెండు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.

1971: రష్యన్ వ్యోమ నౌక సోయుజ్ రోదసి నుంచి తిరిగి భూమి మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు.

జననాలు

1833: మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (మ.1897)

1906: త్రిభువన్, నేపాల్ రాజు (మ. 1955).

1928: జె.వి. సోమయాజులు, రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. (మ.2004)

1934: చింతామణి నాగేశ రామచంద్ర రావు, భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత.

1939: సుంకర వెంకట ఆదినారాయణరావు, పేరుపొందిన ఎముకల వైద్యనిపుణుడు.

1941: ఉప్పలపాటి సైదులు, పౌరాణిక రంగస్థల కళాకారుడు.

1948: తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు.

1969: సనత్ జయసూర్య, శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు.

1970: అరవింద్ స్వామి , చలనచిత్ర నటుడు, మోడల్, పారిశ్రామిక వేత్త.

1973: సితార, ప్రముఖ దక్షిణ భారత చిత్రాల నటి.

1977: శివాజీ , తెలుగు చలనచిత్ర నటుడు, వ్యాఖ్యాత.

1977: సురేఖ వాణి, తెలుగు,తమిళ చిత్రాల సహాయ నటి.

1978: ఇంద్రజ , తెలుగు, మళయాల చిత్రాల నటి, గాయని.

1982: అల్లరి నరేష్, సినిమా నటుడు, తెలుగు సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు.

మరణాలు

1897: మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (జ.1833)

1917: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (జ.1825)

1953: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (జ.1881)

1961: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే ‘ఫోనో ఫిల్మ్‌’ ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873)

1967: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (జ.1899)

1984: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (జ.1892)

1985: కె.హెచ్‌. ఆరా, చిత్రకారుడు (జ. 1914)

1988: సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (జ.1947)

2014: సూర్యకళ, పాతతరం తెలుగు చలన చిత్ర నటి, పలు దక్షిణాది భాషల్లో నటించిన నటి(జ.1942)

2019: నల్లగారి రామచంద్ర తెలుగు కథా రచయిత, కవి, నవల, నాటక రచయిత. (జ.1939)

పండుగలు , జాతీయ దినాలు

అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం (ఆస్టరాయిడ్ దినోత్సవం)

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం.

అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం.