సంఘటనలు
1866: ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది.
1935: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు.
1963: బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.
1988: లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
1988: ఐ.ఎన్.ఎస్. సింధువీర్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
1988: సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది.
1998: తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనును కొనుగోలు చేసింది.
2001: ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు మరణశిక్ష అమలుపరిచారు.
2010: 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యాయి.
జననాలు
1897 : భారతీయ విప్లవకారుడు, బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జననం. (మ.1927)
1920: మహేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (మ. 1972).
1924: అబు అబ్రహాం, ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (మ.2002)
1930: ఎ. సి. త్రిలోకచందర్ , తెలుగు, తమిళ, హిందీ చిత్రాల దర్శకుడు.(మ.2016)
1932: ధారా రామనాథశాస్త్రి, నాట్యావధాని (మ.2016).
1944: మేకపాటి రాజమోహన రెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
1947: లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాజకీయ నాయకుడు.
1956: అనూరాధా లోహియా, అంటువ్యాధులపై పరిశోధనలు చేసే భారతీయ సూక్ష్మ పరాన్న జీవుల శాస్త్రవేత్త.
మరణాలు
1963: టాయ్ క్వాంగ్ డుచ్, దక్షిణ వియత్నాం బౌద్ధ భిక్షువు.
1979: జాన్ వెయిన్, హాలీవుడ్ నటుడు (జ.1907).
1983: ఘనశ్యాం దాస్ బిర్లా, భారత పారిశ్రామిక వేత్త. (జ.1894)
1987: బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (జ.1900)
2001: ఓక్లహోమా, నిందితుడు టిమోతీ మెక్‌వీ.
2001: తిరుపతి స్వామి, తెలుగు, తమిళ చిత్రాల దర్శకుడు, విలేకరి(జ.1966)
2023: కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు (జ. 1976)
పండుగలు , జాతీయ దినాలు
రేస్ యూనిటీ డే (జూన్ రెండవ ఆదివారం)
- ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ప్రాక్టికల్ పరీక్షల్లో కీలక మార్పులు…
- రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం.. నిపుణుల హెచ్చరిక!
- ఏపీలో అల్పపీడన ప్రభావం.. రెండు రోజులు భారీ వర్షాలు, మత్స్యకారులకు హెచ్చరిక
- చరిత్రలో ఈ జూన్ 30…
- నేటి రాశి ఫలాలు జూన్ 30, 2026
- నేటి పంచాంగం జూన్ 30, 2026
- ప్రేమ వివాహం చేసుకున్నాడని అల్లుడి హత్య.. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన
- భారత్‌కు మూడీస్ హెచ్చరిక.. నీటి సంక్షోభం ముప్పు మరింత పెరుగుతోందా?
- శని దోషం నుంచి విముక్తి.. ఈ 6 రాశుల వారికి అక్టోబర్ వరకు అదృష్ట యోగాలు!










