సంఘటనలు
1966: హైదరాబాదులో జవహర్ బాలభవన్ స్థాపించబడింది.
1985: ఎయిర్ ఇండియా విమానం కనిష్క జెంబో జెట్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవటం వలన 329 మంది మరణించారు.
2007: అట్లాంటిస్ రోదసి నౌక 195 రోజుల అంతరిక్షయానం ముగించి ఈ రోజు హుస్టన్ లోని ఎడర్డ్స్ బేస్ లో దిగింది.
జననాలు
1896: రట్టిహళ్లి నాగేంద్రరావు, కన్నడ, తెలుగు, తమిళ నటుడు (మ. 1977).
1907: జేమ్స్ మీడ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1995).
1923: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు (మ.1986).
1935: నాదెండ్ల భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
1940: విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (మ.1994)
1951: హంసలేఖ,సంగీత దర్శకుడు, పాటల రచయిత.
1953: జాస్తి చలమేశ్వర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి.
1980: రాంనరేష్ శర్వాన్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
మరణాలు
1761: బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10 పేష్వా (జ.1720).
1836: జేమ్స్ మిల్, స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వ వేత్త. (జ.1773)
1937: కొంపెల్ల జనార్ధనరావు, భావకవి, నాటక రచయిత. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు. (జ.1907)
1964: చెరుకువాడ వేంకట నరసింహం, ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (జ.1887)
1980: వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి. (జ.1894)
1985: యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (జ.1922)
1993: మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. (జ.1924)
1953 : జనసంఘ్ పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ లో చెరసాలలో మరణం (జ. 1901)
పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం.
ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే
- Sleep Terror: పిల్లల్లో స్లీప్ టెర్రర్ ఎందుకు వస్తుంది? తల్లిదండ్రులు ఏం చేయాలి?
- Jewellery Theft: కస్టమర్ల ముసుగులో నగల దుకాణంలో చోరీ.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు వైరల్
- Mystery Well: గుజరాత్లో బావిలో నీరు అలల్లా ఎగిసిపడటం కలకలం.. శాస్త్రవేత్తలు చెప్పిందేమిటి?
- Highway Shock: ఫ్యాన్లతో ఎక్స్‌ప్రెస్‌వేను ఆరబెడుతున్న అధికారులు.. వైరల్‌గా మారిన దృశ్యాలు
- Rain Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 15 రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Marine One Alert: ట్రంప్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
- ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ప్రాక్టికల్ పరీక్షల్లో కీలక మార్పులు…
- రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం.. నిపుణుల హెచ్చరిక!
- ఏపీలో అల్పపీడన ప్రభావం.. రెండు రోజులు భారీ వర్షాలు, మత్స్యకారులకు హెచ్చరిక










