భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై చేపట్టిన మరమ్మతు పనులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రహదారి కుంగిపోయిన ప్రాంతాన్ని మరమ్మతు చేసే ముందు తేమను తొలగించేందుకు అధికారులు ఎలక్ట్రిక్ ఫ్యాన్లను ఏర్పాటు చేసి రోడ్డును ఆరబెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తెలిపిన వివరాల ప్రకారం, ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా పేవ్మెంట్ కింద ఉన్న పొరల్లోకి నీరు చేరి నేల బలహీనపడింది. దీంతో రహదారి కుంగిపోవడంతో ముందుగా తేమను పూర్తిగా తొలగించి, అనంతరం మరమ్మతు పనులు చేపట్టేందుకు ఫ్యాన్లను వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రహదారి దెబ్బతినడంతో కాన్పూర్-లక్నో మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరువైపులా ప్రయాణించే వాహనాలను ఒకే క్యారేజ్‌వేపై మళ్లిస్తున్నారు. ఒక వైపు వాహనాల రాకపోకలు కొనసాగుతుండగా, మరోవైపు మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోల్ ప్లాజా దాటిన తర్వాత ఎక్స్‌ప్రెస్‌వేపై కొంత దూరం రాంగ్ రూట్లో ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు రూ.4,200 నుంచి రూ.4,700 కోట్ల వ్యయంతో కేంద్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 63 కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్లతో లక్నో-కాన్పూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబడింది. ఈ ప్రాజెక్టును 2026 జూలై 13న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారికంగా ప్రారంభించారు.
అయితే ప్రారంభమైన కొద్ది రోజులకే భారీ వర్షాల కారణంగా ఉన్నావ్ జిల్లాలోని కొరారీ సమీపంలో సుమారు 5 నుంచి 7 మీటర్ల మేర రహదారి కుంగిపోయింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జాతీయ రహదారి నెల రోజులు పూర్తికాకముందే దెబ్బతినడం తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, మరమ్మతు పనులు వేగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు.
Disclaimer :
ఈ వార్త వివిధ న్యూస్ వెబ్సైట్ల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా రాయబడి, సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది. వివరాల పూర్తి ధృవీకరణ పాఠకులదే బాధ్యత. ఈ సమాచారం ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు రచయిత కానీ వెబ్సైట్ కానీ బాధ్యత వహించదు.
- Loan Default: EMI చెల్లించకపోతే బ్యాంకులు ఆస్తులు ఎప్పుడు జప్తు చేస్తాయి?
- Healthy Beauty: అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ అలవాట్లు పాటించండి
- Love Crime: పెళ్లికి ఒత్తిడి… ప్రియురాలిని హత్య చేసిన యువకుడు… వివరాల్లోకి వెళ్ళితే…
- MeeTicket app: డిజిటల్ సేవలు… బస్సు, మెట్రో, ఆటో, క్యాబ్.. అన్నీ ఒకే యాప్‌లో!
- Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? ఎలా తెరవాలి?






