సింగరేణి పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పనివేళలను మార్చాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఏరియా కార్యదర్శి కుంట ప్రవీణ్ కుమార్ ఈ విషయంపై అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3 కృషి భవన్ వద్ద యాక్టింగ్ మేనేజర్ లక్ష్మణరావును కలిసి ఈ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో మార్నింగ్ షిఫ్ట్‌ను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో షిఫ్ట్‌ను సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించేలా మార్పులు చేయాలని సూచించారు. తీవ్ర ఎండల నేపథ్యంలో కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు.
అదేవిధంగా పనిస్థలాల్లో కూలింగ్ విశ్రాంతి షెల్టర్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. రోడ్లపై దుమ్ము తగ్గించేందుకు ప్రతిరోజూ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లాలని కూడా సూచించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉల్లి మొగిలి, వినేష్, శివకుమార్, రాజేందర్, సంతోష్, తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
- చాక్లెట్ తింటే ఆరోగ్యానికి మేలా? కీడా? లాభాలు – నష్టాలు తెలుసుకోండి!
- బ్యాంక్ లాకర్లో బంగారం పోతే ఏం జరుగుతుంది? RBI నిబంధనల ప్రకారం ఎంత పరిహారం వస్తుంది?
- వర్షాకాలంలో తులసి ఆకులు తింటే ఏమవుతుంది? ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా!
- IVF చికిత్సలో యోగా ఎంత ఉపయోగకరం? సక్సెస్ అవకాశాలు పెంచడంలో ఎలా సహాయపడుతుంది?
- దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? మీ బ్లడ్ గ్రూప్ కూడా కారణం కావొచ్చు!






