రుచులు మొత్తం 6 రకాలు .  అవి 

తీపి , పులుపు , ఉప్పు , చేదు , కారము , వగరు అని 6 రకాలుగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఈ ఆరు రుచులు అంతర్లీనంగా ఉంటాయి. మనుష్య శరీరం నందు రోగాలు పుట్టుటకు మరియు రోగాలు తగ్గుటకు మనకి ఈ ఆరు రుచులు సమ్మిళితమైన ఆహారమే ప్రధాన కారణం .

    ప్రథమంగా ముందు మన ప్రాచీన ఆయుర్వేదం లో మానవ శరీరం గురించి మీకు వివరిస్తాను.  మానవశరీరం నందు ఏడు చర్మములు , ఏడు ధాతువులు , ఏడు ఆశయాలు , ఏడు వందల శిరలు , అయిదు వందల పేశిలు , తొమ్మిది వందల స్నాయువులు , మూడు వందల ఎముకలు కాని చరకుడు వివరించిన దానిప్రకారం ఎముకలు మూడువందల ఆరు. పాశ్చాత్త్యా సిద్ధాంతం ప్రకారం రెండువందల పదియే కలవు. రెండు వందల పది సంధులు , నూట ఏడు మర్మస్థానములు , ఇరవైనాలుగు ధమనులు , మూడు దోషములు , మూడు మలములు , తొమ్మిది స్రోతస్సులు , పదహారు కండరములు , పదహారు సన్నని జాలములు అనగా సన్నని నరముల అల్లికలు , ఆరు కూర్చములు అనగా ఎముకల కట్టలు నాలుగు మరియు శిరల కట్టలు రెండు రకాలు . నాలుగు పెద్దతాళ్లు , ఏడు కుట్లు , పదనాలుగు ఎముకల కూటములు , పదనాలుగు సీమంతములు , ఇరువది రెండు శ్రోతస్సులు , రెండు ప్రేవులు , మూడున్నరకోట్ల రోమకూపములు.   ఇంత ఉత్క్రుష్టమైనది మానవశరీరం . నిద్రాహార విహారాలలో మార్పులు మరియు హెచ్చుతగ్గుల వలన శరీరంలో రోగాలు సంభవిస్తాయి.

       కొన్ని రకాల ద్రవ్యములను తినిన యెడల శరీరంలో రోగాలు నశించగలవు. కొన్నిరకాల ఆహారపదార్థాలను తినిన యెడల శరీరం నందు కొత్తకొత్త రోగాలు పుట్టును . అసలు రోగం అంటే ఏంటో మీకు తెలియచేస్తాను .శరీరధారకములు అగు వాత, పిత్త, శ్లేష్మములలో ఉండవలసిన ప్రమాణం కంటే హెచ్చుతగ్గులు ఉండుటయే రోగం . 

      మనం తీసుకునే ప్రతి ఆహారం 6 రకాల రుచులతో సమ్మిళతం అయి ఉంటుంది అని చెప్పాను కదా .  ఇందులో మొదటివగు తీపి , పులుపు , ఉప్పు ఇవి వాత దోషమును పోగొట్టును . చేదు , కారం , వగరు ఇవి కఫాన్ని హరించును . వగరు, చేదు , తీపి రసములు పిత్తదోషమును హరించును . ఆహారం జీర్ణం అయిన తరువాత వేడిచేయుట , చలువచేయుట అను రెండు విధాలుగా మాత్రమే ఉండును.  

 ఇప్పుడు మీకు రుచులు వాటి యొక్క గుణాలు తెలియచేస్తాను .

మధురరస గుణములు

తీపిగా ఉన్న పదార్థాలను తినటం వలన , పుట్టినప్పటి నుండి అలవాటు పడిన సప్త ధాతువులకు బలం కలుగును.

చిన్నపిల్లలకు , ముసలివారికి , దెబ్బలు తగిలిన వారికి , బలం క్షీణించినవారికి , రక్తమాంసములు క్షీణించినవారికి తీపి పదార్థాలు చాలా హితకరం అయినవి.

శరీరవర్ణం పెరుగుటకు , వెంట్రుకల వృద్ధికి , ఇంద్రియ బలం పెరుగుటకు , ఓజస్సు వృద్ది చెందుటకు ఈ మధుర రసం ఉపయోగపడును.

శరీరంకి మంచి పుష్టిని ఇచ్చును.

కంఠస్వరం పెరుగును .

బాలింతలగు స్త్రీలకు ఎండిపోయిన పాలను వృద్ది పరుచును.

ఆయుష్షుకు కారణం , ప్రాణరక్షణకరమైనది .

వాత, పిత్త, విషాలను హరించును . గమనిక – ఈ మధుర రసమును అధికంగా వాడిన మేధస్సుతో కూడిన కఫ వ్యాధులను పుట్టించును .శరీరం లావెక్కును . అగ్నిబలం తగ్గును అనగా జఠరాగ్ని తగ్గును. ఇరువది అగు మేహరోగాలు జనించును. అర్బుదం అనగా గడ్డతో కూడిన కేన్సర్ వచ్చును.

ఆమ్లరసం గుణములు

ఈ ఆమ్లరసం ( పులుపు ) అగ్నిదీప్తి అనగా జఠరాగ్ని పెంచును.

హృదయముకు బలమునిచ్చును.

ఆహారాన్ని అరిగించును.

రుచిని పుట్టించును .

శరీరం నందు వేడి కలుగచేయును .

మలాన్ని విడిపించును.

తేలికగా జీర్ణం అగును.

కడుపులో బిగిసి ఉన్న వాయువుని బయటకి వెడలించును. గమనిక – దీనిని అధికంగా వాడినచో కఫమును పెంచును , రక్తపిత్త వ్యాది అనగా నోటివెంట రక్తం పడువ్యాధిని పుట్టించును, శరీర అవయవాల పట్టు సడలించును, తిమ్మిరి, భ్రమo, దురదలు, పాండురోగం, విసర్పవ్యాధి, శరీర భాగాల్లో వాపు, దప్పిక, జ్వరం వంటి వ్యాధులను పుట్టించును.

లవణ రస గుణాలు

ఈ లవణ రసం శరీరంలో స్తంభించిన దోషాన్ని విడిపించి బయటకి పంపును .

జఠరాగ్ని పెంచును.

చమురు కలది.

చెమట పుట్టించును .

తీక్షణమైనది , రుచిని పుట్టించును .

వ్రణములు అనగా గడ్డలు పగిలేలా చేయును .

శరీరం నందు మలినపదార్థాలు విడగొట్టి బయటకి పంపును గమనిక – ఈ లవణ రసాన్ని అధికంగా వాడటం వలన వాతారక్త వ్యాధిని కలిగించును . బట్టతలను తగ్గించును . వెంట్రుకలు నెరిసిపోవును , శరీరం ముడతలు పడును. దప్పికను కలిగించును , కుష్టు రోగము కలుగును. విసర్పి రోగం కలుగును. బలమును హరించును.

తిక్త ( చేదు ) రస గుణాలు

ఇది అరుచిని హరించును .

శరీరం నందలి క్రిములను , దప్పిక , విషమును , కుష్టు , మూర్ఛని హరించును .

మూర్చ, జ్వరాలను , శరీరం నందలి మంటలను, వేడిని , కఫాన్ని హరించును .

శరీరం నందలి వ్రణాల నుండి కారు దుష్టజలాన్ని , మాంసం నందలి కొవ్వుని కరిగించును. ఎముకల్లో మూలుగను , శరీరంలో మలమూత్రాలను హరించును .

తేలికగా జీర్ణం అగును.

బుద్దిని పెంచును.

చమురు హరించును .

స్త్రీల పాలు యందు మరియు కంఠం నందలి దోషాలు పొగొట్టును. గమనిక – అధికంగా తీసుకున్న ధాతువులను క్షీణింపచేసి వాత రోగాల్ని పుట్టించును.

కటు ( కారం ) రసం గుణాలు

ఈ కటు రసం కంట రోగం , కుష్టు , వాపు పోగొట్టును.

వ్రణములు తగ్గించును

శరీరం నందలి దుష్ట జలాన్ని , కొవ్వుని హరించును .

జఠరాగ్ని పెంచును.

అన్నమును జీర్ణింపచేయును .

రుచిని పుట్టించును .

సన్నని నరములలోని దోషాలు కూడా శోధించి వ్యర్థాలను బయటకి పంపును .

నవరంధ్రాలు ను తెరిపించును.

కఫాన్ని హరించును . గమనిక – దీనిని అతిగా తీసుకున్నచో దప్పిక పుట్టించును . శుక్రమును , బలాన్ని నశింపచేయును. మూర్చని కలిగించును. అంగములు ముడుచుకున్నట్లు చేయును . వణుకు పుట్టించును .నడుము , వీపు నందు నొప్పి కలుగచేయును.

కషాయ ( వగరు ) రస గుణములు

వగరు పదార్థం పిత్తశ్లేష్మాలని హరించును .

రక్తాన్ని శుద్దిచేయును .

నొప్పిని కలిగించును.

వ్రణాలను మాన్చును.

శరీరం నందలి దుష్ట జలాన్ని తీసివేయును .

ఆమమును స్తంభింపచేయును .

మలాన్ని గట్టిపరుచును.

చర్మాన్ని నిర్మలంగా చేయును . గమనిక – దీనిని అతిగా సేవించిన మలబద్దకం , కడుపు ఉబ్బరం , గ్యాస్ , గుండెజబ్బులు , దప్పిక, లివరు చిక్కిపోవుట, సంభోగ శక్తిని నశింపచేయును . మలబద్దకం కలిగించును. పైన చెప్పిన విధంగా మనం తీసుకునే ఆహార పదార్థం యొక్క రుచిని బట్టి మన ఆరోగ్యం అధారపడి ఉండును. ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు. గమనిక – నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం . కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ : 9885030034 మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .