జీవితంలో గెలిచిన ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఫెయిల్ అయ్యానని నిజాయితీగా ఒప్పుకుని తీరాల్సిందే… ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ లేని సక్సెస్ ఉండదు.

గెలుపు, ఓటమి రెండు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిసారి మాత్రం గెలుపు వస్తుందని అనుకోకండి.

మరి అసలు ఎందుకు ఫెయిల్ అవుతాము..?, ఫెయిల్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి…?, ఏం చేస్తే ఫెయిల్యూర్ రాదు…? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు…

పట్టుదల ఉండాలి…

పట్టుదల ఉంటే ఎలాంటి కష్టమైనా భరించవచ్చు. పట్టుదలతో ఎంత గొప్ప స్థానం అయిన పొందొచ్చు. పట్టుదల తగ్గింది అంటే ఇక ఫెయిల్ అవుతాము.

ఫెయిల్ అయినప్పుడు గతం లో మీరు చేసిన తప్పులను తెలుసుకుని వాటిని భవిష్యత్తులో చేయకుండా ప్రతీది సవాలుగా తీసుకుని మీరు ముందుకు వెళ్లాలి.

మీపై మీకు నమ్మకం ఉండాలి…

నేను సాధించగలను అని నమ్మకంగా నీ మీద నీకు ఉండాలి. ఆ నమ్మకం లేకుంటే ఏమీ చేయలేరు. కావున ఎంతటి కష్టం లోనైనా మీ పై నమ్మకాన్ని ఉంచుకోవాలి.

చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేయకూడదు.

తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి కానీ ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ చేయద్దు. మీరు చేసిన తప్పులు దిద్దికొనే ప్రయత్నం చేయాలి.

ఆ విధంగా చేయడం వల్ల మీరు అభివృద్ధి పథంలో నడువ డానికి వీలు పడుతుంది.