ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే…
సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి…
నీరే పైకి ఆవిరి కాకున్నా వర్షాలు పడే అవకాశం లేదు,
అలాగే మనం చేసే ప్రార్థనలు పైకి చేరితేనే భగవంతుని ఆశిస్సులు కిందికి రాగలవు…
భగవంతుడున్నాడనే స్పృహ లేకుండా నిత్యం తీరిక లేని వారివలే, సంసార సాగరంలో, మునిగి ఉంటూంటే ఇంకా, భగవద్ అనుగ్రహం ఎక్కడి నుండి వస్తుంది?…
సరైన సాధన చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే వచ్చేవి చింతలే తప్ప ఇంకేమీ రావు…
నిత్యం సాధన చేయాలి, భగవంతుడిని అనుభవించాలి, ఏది జరిగినా ఆయన దయ అన్న భావం వుండాలి, అపుడే భగవదనుగ్రహం కలుగుతుంది.