🔴 గెలుపునకు తుది మెట్టు అంటూ ఏదీ ఉండదు…
ఓటమి అన్నది ఎప్పుడూ అపకారి కాదు…

ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక్క ధైర్యమే…

సాహసించేవాడి వెనుకే అదృష్టం నడుస్తూ ఉంటుంది.

🔷 మనకు ఆనందం వస్తే పొంగకూడదు…
దుఖఃం వస్తే కుంగకూడదు…
పొగిడారని మన వారు అనుకోవద్దు…
తిట్టరాని పరాయి వారు అనుకోవద్దు…
ఏదైన నవ్వుతూ సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగిపోలి, అప్పుడు విజయం మనదే…

🌹ఒక మనిషి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో…, తక్కువ వాడిననుకోవడంకూడా అంతే తప్పు…

మొదటి గర్వానికి, రెండోది పిరికితనానికి దారితీస్తాయి…

చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మరచిపోవచ్చు… కానీ ! మనకు చేయూతనిచ్చి, మనల్ని అభివృద్దిలో పెట్టిన మనషుల్ని మరువకూడదు…