🔶 పంచదార తియ్యగా ఉందని ఎక్కువ తినటం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని మన బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే.

🔶 పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం ఇవి ఏవీ తృప్తినివ్వవు. మన దగ్గర ఏమీ లేదు అంటే అది మన తప్పు కాకపోవచ్చు కానీ.. మన దగ్గర ఒక స్నేహితుడు కూడా లేడంటే మాత్రం అది మన తప్పే.!

🔶 నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అంటుంటారు కానీ.. ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు రెండున్నాయి. మనలో మొదటిది స్వచ్ఛమైన నవ్వు. రెండవది సంతోషాన్ని, ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత, కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు. కానీ… మనకి దేవుడిచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరిగేవి..!

🔶 పెద్దోడి ఆకలికి పంచభక్ష్య పరమాన్నాలు అనే ఆప్షన్ ఉంటుందేమో కానీ పేదోడి ఆకలికి పని దొరికిన రోజే తిండి అనే క్యాప్షన్ మాత్రమే ఉంటుంది.