ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి సంతోషం నేర్పుతుంది ఎన్నో వి‌షయాలు మనకు.

◼️ కన్నీళ్ళు నేర్పాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు.

◼️ఓటమి నేర్పింది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు.

◼️ మోసం నేర్పింది అదుకే పెద్దలు అంటారేమో ఏం జరిగిన మన మంచికే అని.

◼️సర్దుకు పోయే గుణం అనేది ఆరోజుల్లో ఒక గొప్ప లక్షణం కానీ ఈ రోజుల్లో అది ఒక చేతకాని తనం అయిపోయింది .

◼️ విలాసవంతమైన జీవితం అనుభవించినంత వరకు గౌతముడు రాజు గానే మిగిలాడు అన కోటలు విడిచి పదవులు మరచి జనం కోసం మార్పుకోసం అడుగు వేసిన రోజే బుద్ధుడు గా మారి దేవుడయ్యాడు .

◼️ రోజులు మారాయి ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యవాళ్లు కానీ ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పాతిక మంది శత్రువులు తయారవుతున్నారు.

◼️ స్థానాన్ని బట్టి మారుతుంది న్యాయం.

◼️ కాలానుగుణంగా కదులుతుంది న్యాయం.

◼️ మాట తిప్పుడు బట్టి మారే న్యాయం వ్యక్తులను బట్టి పలుకుతుంది న్యాయం.

◼️ ప్రతి సమస్య వెనుక సమాధానం .
దుఃఖం వెనుక సఖం కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పడూ ఉంటుంది.

◼️మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి జీవితంలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చనట్లుగా బతకడం కన్న మనకు నచ్థనట్లుగా జీవించడం మంచిది.