ఏకాదశి ముందు రోజు దశమినాటి రాత్రి భోజనం చేయరాదు. ఫలహారం స్వీకరించవచ్చు. ఏకాదశినాడు యథాశక్తి ఉపవసించాలి. లక్ష్మీనారాయణలను పూజించి పారాయణం, జపం, ధ్యానం, సంకీర్తన వంటివి ఆచరించాలి. వీలైనంత మౌనాన్ని అవలంబించాలి ( వృధా సంభాషణలు, నిందా, పరుష వచనాలు పలుకరాదు).

మరుసటి రోజున (ద్వాదశినాడు) మళ్ళీ పూజ చేసి, శుచిగా వండిన ఆహారాన్ని భగవంతునికి నివేదించి విష్ణుస్వరూపంగా భావిస్తూ శక్త్యనుసారం విప్రునకు భోజనం పెట్టి, తదనంతరం తాను భుజించాలి. ఇది ఏకాదశీ వ్రతవిధి.