యతి అంటే కర్మ యోగి లేదా సాధకుడు.
వశీ అంటే సిద్ధపురుషుడు లేదా ఆత్మ జ్ఞాని
యతీ అంటే జ్ఞాని కావడానికి యత్నించేవాడు. కర్మయోగే యతి అనబడతాడు. వశీ అంటే ఇంద్రియనిగ్రహం పూర్తిగా కలిగినవాడు. సాధువులకు జ్ఞాని ఈ పదం వాడ బడుతుంది. ఈయన దేహి దేహంలో వుంటూ విడిపడి తను దేహం కాను అన్న జ్ఞానం కలిగిన వాడు తను వుండ బట్టే దేహం నడుస్తున్నాది అని ఎరిగినవాడు. అజ్ఞానికి ఈ జ్ఞానం లేదు. తను దేహాన్ని ఆశ్రయించినవాడు అనుకుంటున్నాడు.