1.మోరేశ్వర్ : ఇది సర్వప్రధానమైనది. ఇది భూస్వానంద క్షేత్రంగా ప్రసిద్ధిని పొందింది. ఇందు మయూర గణపతిమూర్తి ఉంది. పూనాకు 40 మైళ్ల దూరంలో ఉన్నది.

2.ప్రయాగ : ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. ఇది ఓంకార గణపతి క్షేత్రం.

3.కాశి : ధుంఢి రాజ క్షేత్రం.

4.కలంబ : చింతామణి క్షేత్రం . గౌతమ మహర్షిచే శపింపబడి ఇంద్రుడు, చింతామణి గణపతిని స్థాపించి పూజించాడని కథ. దీని పూర్వనామం కదంబపురం యవత మాల్ సమీపంలో ఉన్నది.

5.అదోష్ : నాగపూర్ – ఛిందా వాడా రైల్వే లైనులో సామనేర్ స్టేషన్ కి సమీపంలో శమీ విఘ్నేశ్వర క్షేత్రమిది. బలి, యజ్ఞవాటికకు వెళ్లడానికి ముందుగా వామనుడీ మూర్తిని పూజించి వెళ్లాడని ప్రతీతి దైత్య సంహారం కోసం మునులీ విగ్రహాన్ని పూజించారని కథ. విగ్రహం 18 అడుగుల ఎత్తు, ఏడడుగుల వెడల్పు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఊరు పురు శమీమూలపూర్ ఆలయం ఉత్తరముఖంగా ఉన్నా విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది.

6.పాలీ: దీని పూర్వనామం పల్లీపూర్ బల్లాలుడనే వైశ్యబాలకుని భక్తి విశేషం వల్ల గణేశుడు, ఆవిర్భవించాడని కథ. కనుకనే దీనిని బల్లాల వినాయక క్షేత్రమని అంటారు. ఇది సింధుదేశంలో ఉండేదని అంటారు. ప్రస్తుతం, మహారాష్ట్రలోని కులాబా జిల్లాలోని పాలి యనబడే క్షేత్రంగా ప్రసిద్ధిని పొందింది.

7.పారినేర్ : ఇది మంగళమూర్తి క్షేత్రం. మంగళగ్రహం తపస్సు చేసి గణేశుని పూజించాడట, ఇది గ్రంథాలలో నర్మదాతీరంలో ఉన్నట్లు పేర్కొనబడింది. ఏ ప్రాంతంలో ఉందో తెలియదు ఖచ్చితంగా.

8 గంగామసలే : ఇది బాలచంద్ర గణేశ క్షేత్రం. చంద్రుడారాధించిన మూర్తి, కాచీగూడా మన్మాడ్ రైల్వే లైన్ లో సైటాస్టేషన్ ఉంది. దీనికి 15 మైళ్ల దూరంలో గోదావరి మధ్యలో క్షేత్రం ప్రసిద్ధిని పొందింది.

9.రాక్షససభువన : జాల్నానుండి 33 మైళ్ల దూరంలో గోదావరీ నది తీరంలో ఉంది. దీనిని విజ్ఞాన గణేశక్షేత్రమని అంటారు. దత్తాత్రేయులు తపస్సు చేసి, స్థాపించారట.

10.థే ఊర్ : పూనా నుండి అయిదు మైళ్ల దూరంలో బ్రహ్మ సృష్టించేటపుడు విఘ్నాలను పోగొట్టుకోవడం కోసం ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి పూజించాడని కథ. అష్టవినాయక క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ చింతామణి గణపతి.

11.సిద్ధ టేక్ : బొంబాయి రాయచూర్ లైన్ లో బోరీవలీ స్టేషన్ కి ఆరు మైళ్ల దూరంలో భీమానదీ ఆతీరంలో ఇది ఉంది. దీని పూర్వనామం సిద్దాశ్రమం. విష్ణువు, మధుకైటభులను చంపడానికి ముందు దీనిని స్థాపించి పూజించాడని, వేద విభజన చేయడానికి ముందు వ్యాసుడితణ్ణి కొలిచాడని అంటారు.

12.రాజన్ గాంవ్ : మణిపుర క్షేత్రం. పూనా నుండి ఇక్కడకు బస్సులో రావచ్చు. త్రిపురాసురులను చంపడానికి ముందు శివుడు గణపతిని స్థాపించి పూజించాడని సఫల మనోరథుడయ్యాడని కథ. ఇక్కడ మందిరం పూర్వాభిముఖంగా ఉంటుంది. ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలంలో ఈ మూర్తిపై సూర్య కిరణాలు పడతాయి. ఇతడు మహాగణపతి. ఇతని పేరు మహోత్కటుడు, ఈ మూర్తి క్రింద మరొక మూర్తి ఉన్నాడు. ముస్లిమ్ దండయాత్రలో ఈ మూర్తిని నాశనం చేశారు.

13.విజయపూర్ : అనలాసురుణ్ణి చంపడానికి ఇందు గణేశుడావిర్భవించాడని కథ. త్రిలింగదేశంలో ఉందని గ్రంథాలలో ఉంది. ఎక్కడో వివరింపబడలేదు. మద్రాసు మంగుళూర్ లైనులో ఈ రోడ్ నుండి 16 మైళ్ల దూరంలో విజయమంగళం స్టేషన్ ఉంది.

14.కశ్యపాశ్రమం : కశ్యపుడు పూజించిన చోటు ఎక్కడో తెలియదు. గ్రంథాలలో నిర్దేశింబడలేదు.

15.జలేశపూర్ : ఇది ఎక్కడో తెలియదు.

16.లేహ్యాద్రి : పూనా జిల్లాలోని జూఆర్ తాలూకాకు అయిదు మైళ్ల దూరంలో ఉంది. అష్టవినాయకులలో ఇది యొక్కటి. ఇక్కడికి సమీపంలో బౌద్ధ గుహలున్నాయి. మూర్తి గిరిజాత్ముడు.

17.చేరోల్ : దీని పూర్వనామం ఐలాపూర్ క్షేత్రం. అంగాబాద్ నుండి బోరేలేనకు (ఎల్లోరా) బస్సుంది. అక్కడే ఘుశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఇందు గణేశ ప్రతిమ కూడా ఉంది. ముందు తారకాసురుణ్ణి కుమారస్వామి జయింప లేకపోయాడని శంకరుని ఆదేశం ప్రకారం ఇతట్టి కుమారస్వామి స్థాపించి పూజించాడని కథ. ఈ మూర్తిని లక్షవినాయకుడని అంటారు.

18.పద్మాలయ : ఇది ప్రవాళక్షేత్రం బొంబాయి భుసావల్ రైల్వే లైనులో పాచోరా జంక్షన్ నుండి పదహారు మైళ్ల దూరంలో మహాసావద్ స్టేషన్ ఉంది. ఇక్కడ నుండి అయిదు మైళ్ల దూరంలో ఈ తీర్థం కార్తవీర్యార్జునుడు, శేషుడు ఇక్కడ గణపతిని ఆరాధించారని వారు స్థాపించిన వారు మూర్తులను చూపిస్తారు.

19.నామగాంవ్ : కాచీగూడా మన్మాడ్ లైనులో ఉన్న జాల్నాస్టేషన్ సమీపంలో ఈ క్షేత్రం ఉంది. దీని పూర్వనామం అమలాశ్రమక్షేత్రం తల్లి శాపం నుండి విముక్తిని పొందడానికి యముడితణ్ణి స్థాపించాడని కథ.

20.రాజూర్ : జాల్నా స్టేషన్ నుండి కొద్ది మైళ్ల దూరంలోని రాజసదన క్షేత్రం ( పూర్వనామం ) సిందూరాసురుణ్ణి చంపిన తరువాత గణేశుడు వరేణ్యుడనే రాజునకు గణేశ గీతను వినిపించాడట.

21.కుంభకోణం : దీనిని శ్వేత విఘ్నేశ్వక్షేత్రమని అంటారు . కావేరీ నదీతీరంలో సుధాగణపతి మూర్తి ఉన్నాడు. అమృతమథన సమయంలో అమృతం రాకపోతే దేవతలితనిని స్థాపించారని కథ.