కొత్తిమీర శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా దీన్ని ఆహార రుచిని పెంచడానికి కూడా ఉపయోగిస్తున్నారు.

కొత్తిమీరలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కొత్తిమీర వాటర్ ను పరిగడుపున తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.