బ్రాహ్మీముహూర్తాన్ని మంత్ర సాధనకు ప్రశస్తమైనదని చెబుతారు. తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు.

బ్రాహ్మీముహూర్తంపై ఏ గ్రహాల ప్రభావమూ ఉండదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సైతం అతీతమైన సర్వ చైతన్యమయమైన అమ్మవారి శక్తి మాత్రమే ఈ కాలంలో ప్రభావవంతంగా ఉంటుంది. చదువుకు, జపసాధనలకు బ్రాహ్మీముహూర్తాన్ని మించింది లేదని చెబుతారు.