అపమృత్యుదోషాలను పరిహరించే మహా కాల భైరవుని పూజ.

కుంభమేళా సమయం లో అదీ మహాకాలుని సన్నిధి అయిన ఉజ్జయినిలో జరిగే కాలాష్టమికీ ఎంతో విశిష్టత ఉంది.

కుంభస్నానం తరువాత భక్తులు అక్కడి నాగసాధువుల దీవెనలతో మహా కాలుని మందిరం లో కాలాష్టమి వ్రతం చేస్తారు.

సాయంకాల సమయంలో కుంభస్నానాన్ని ఆచరించి మహాకాలుని దర్శించుకుంటారు. ఈ రోజు వ్రత దీక్షలో ఉన్నవారు ఉపవసిస్తారు.

కాలభైరవ స్వామి హారతి దర్శించుకున్న తరువాత ఫలహారం తో ఉపవాస దీక్షను విరమిస్తారు. రాత్రి జాగరణ చేసి భైరవుని కథలను భక్తిగా గానం చేస్తారు.

కాలాష్టమినాడు నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు.

మహాశివుని అర్చించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. కాలాష్టమి రోజున చేసే పితృ తర్పణాల వల్ల వంశాభివృద్ధి చేకూరుతుంది.