చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో…
భూమిని చూసి ఓర్పును నేర్చుకో…
చెట్టును చూసి ఎదగడం నేర్చుకో…

బయట కనిపించే మురికి గుంటలకన్నా మనుసులో మాలిన్యం కల వ్యక్తులు ఎంతో ప్రమాదకారులు.

సత్యాన్ని నమ్మే వ్యక్తి అనుకువగా ఉంటాడు. అన్ని జ్ఞానాలలో కెల్లా అత్యున్నతమైనది తనను తాను తెలుసుకోవడం. మనలోని దేవుడు సంతసించాలంటే మనలో గర్వం నశించాలి.

నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే… వంద మంది గొప్పవాళ్ళ గురించి నీవు ముందు తెలుసుకోవాలి.

కోపగించుకోవడం అంటే మనమీద మనమే ప్రతీకారం తీర్చుకోవడం.

కేవలం డబ్బు ఉంటే సరిపోదు. డబ్బుతో పాటు మంచి వక్త్విత్వం ఉండాలి..నీ కోసం నీవే అలోచించి నీ జీవిత పథకాన్ని నీవే రచించుకోవాలి.

ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో ఉండదు. అతని మంచి హృదయంలో ఉంటుంది.

సహాయం చేస్తే మరిచిపో… సహాయం పొందితే జీవితాంతం గుర్తించుకో…

వ్యక్త్విత్వన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్టే. ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి.

నీవు ఈ ప్రపంచానికి అర్థం కాకున్నా బ్రతికేయవచ్చు కాని, నీకు నీవు అర్థం కాకుంటే ఈ ప్రపంచంలో ఎక్కడ బ్రతకలేవు.

ఎవరో తెలియని లోకంలోకి వస్తాము … మనమే లోకమనేలా చాలా మందికి దగ్గెర అవుతాము. చివరికి ఎవరితో ఉండకుండానే పోతాం…అదే జీవితమంటే.

పిల్లవేర్లు తల్లి వేరును చుట్టి ఉంటాయి. బందాలన్నీ బందకాలు కాదు… బాధ్యతలు. కొన్నేమో ధర్మానుసారం, మరికొన్నేమో అనుభవానుసారం… ఇదే జీవిత సత్యం.

అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది.ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది.

నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు మారవచ్చు కాని, మనం చేసిన మంచి ఎన్నటికీ మారదు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది. మంచి పని నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది.