క్యాన్సర్ కు చికిత్స కోసం మసాలా దినుసులను ఉపయోగించేందుకు మద్రాస్ IIT పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ అంశంపై పేటెంట్ పొందగా.. వీటితో తయారైన మందులు 2028 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. దేశీయ మసాలాలతో తయారు చేసిన ఈ మందులకు క్యాన్సర్పై పోరాడే సామర్థ్యముందని శాస్త్రవేత్తలు తెలిపారు. జంతువులపై ప్రయోగాలు విజయవంతమవగా.. మనుషులపై వీటి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.