ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పని చేయటం వలన కళ్ళకు చాలా రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఇక్కడ కొన్ని రకాల చిట్కాలు ఇవ్వబడ్డాయి.

కళ్ళు ఎలా పనిచేస్తాయి?
మీకు తెలుసా కంటి చూపు ఎలా పని చేస్తుందో, మీ కంటి చూపుకి ఏ అలవాట్లు మంచివో, మరియు ఏ అలవాట్లు మీ కంటి చూపుకి ప్రమాదకరమో మీకు తెలుసా? వీటి గురించి తప్పక తెలుసుకోండి.

కంటి చూపుకి ప్రణాలిక
మీ గదిలో ఎల్లప్పుడూ కంటి గురించి తెలిపే పటంను అంటించాలి. మరియు మీరు నెట్’లో కూడా దీని గురించి వెతకవచ్చు. వీటి వలన కళ్ళకు హాని కలిగించే వాటి గురించి అవగాహన పొందుతారు

కళ్ళకు ఉపశమనం
గంటల పాటు కంప్యూటర్ తెర ముందు పని చేసేటపుడు, కళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. కావున కళ్ళకు కొన్ని రకాల వ్యాయామాలను చేయటం వలన ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. రెండు చేతులను జోడించి రాయండి ఫలితంగా కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిగా ఉన్న చేతులను కళ్ళపై పెట్టుకొని మరియు కాంతి కళ్ళపై పడకుండా జాగ్రత్త పడండి. ఇలా చేయటం వలన కళ్ళు ఒత్తిడి నుండి విశ్రాంతి లేదా ఉపశమనం పొందుతాయి

మీ కళ్ళను పోడిబారనివ్వకండి
మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సరిపోయేంత తేమని అందించాలి. కళ్ళు పొడిగా మారినపుడు దురదగా, ఎరుపుగా మరియు నొప్పిగా అనిపిస్తుంది. ఇలాంటి ఇబ్బందులు తొలగిపోవటానికి తరచుగా కనురెప్పలను వాల్చండి మరియు సమయం టి.వి. లేదా కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపకండి.

వ్యాయామాలు
మీ కళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుకోటానికి, తప్పకుండా వాటికి కొన్ని వ్యాయామాలను చేయాలి. ప్రతి 20 నిమిషాలకి, 20 ఫీట్ల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడటం వలన మీ కళ్ళకు వ్యాయామాలను అందించిన వారవుతారు

కళ్ళకు అనుగుణంగా మార్చుకోండి
మీరు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు గడపవలసి వచ్చినపుడు, వివిధ రకాల వస్తువులను వివిధ కోణాలలో, దశలలో తరచుగా చూస్తూ ఉండటం మర్చిపోకండి. ఒకే వైపు చూడటాన్ని తగ్గించి, వివిధ కోణాలలో చూడటం కంటి ఆరోగ్యానికి మంచిది

కాంతిని తగ్గించండి
కళ్ళకు విశ్రాంతిగా అనిపించటానికి, కంప్యూటర్ తెర యొక్క కాంతిని తగ్గించుకోండి. కానీ, తెర కాంతిని మరి ఎక్కువగా తగ్గించకండి ఇది కుడా కళ్ళకు ప్రమాదాన్ని కలుగచేస్తుంది.

విశ్రాంతి తీసుకోండి
ఎపుడైతే అధిక పని లేదా ఎక్కువ ఒత్తిడిలో ఉన్నపుడు తరచుగా విశ్రాంతి తీసుకోండి. ఈ విశ్రాంతుల వలన మీ కళ్ళ పైన పడే ఒత్తిడిని తగ్గుతుంది మరియు పూర్వపు స్థితికి వచ్చేల చేస్తుంది.

ఆధారము : te.vikaspedia.in