నీకు నీవే గొప్పలు చెప్పుకోకు. నీ గొప్పతనం పదిమంది చెప్పాలి. గొప్పతనం అనేది మంచి మనసులో ఉంటుంది. నిస్వార్థ భావములో ఉంటుంది.

గొప్పగా జీవించడం అంటే, ఆదర్శంగా జీవించడం. గొప్పగా బ్రతకటం అంటే, గొప్పలు చెప్పుకుని బ్రతకటం కాదు… గొప్ప పనులు చెయ్యటం. నలుగురి చేత చేయించటం._*

నలుగురు నీ గురించి మాట్లాడుకోవాలి అంటే… నీ వెనక నలభై మంది ఉండాల్సిన అవసరం లేదు. నీ ముందు ఒకే ఒక్క గొప్ప ఆశయం ఉంటే చాలు. అదే నిన్ను నడిపిస్తుంది. నీ వెనక నలభై మంది నడిచేలా చేస్తుంది.

ఎదుటివారి కన్నీళ్లు నీ హృదయాన్ని ద్రవింప చేయాలి. మంచి ఆశయం కోసం జీవించండి. ఆ ఆశయ సాధనకై శ్రమించండి. చెప్పడం కాదు, అనుకున్న ఆశయాన్ని పూర్తి చేయడం ముఖ్యం. కాబట్టి ఆశయం కోసం కష్టపడి ఇష్టపడి మన పని మనం చేసుకుంటూ పోతే మనల్ని ఏదీ ఆపలేదు.