🔷 మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి. కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు.

🟢 మనం ఎదుటివారితో పిరికి మాటలు మాట్లాకూడదు, వినకూడదు. అవే మన జీవిత గమనానికి అటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మనం పిరికి వారమవుతాము.

🔴 మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి, ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం చేయగలవు.

అవే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు

🔶 జీవితం అనేది గమ్యం కాదు. గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది.

🔷 ఇతరులకు సహాయం చేయాలంటే మనం కోటీశ్వరులం అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. మానవత్వం ఉంటే చాలు, సహాయం ఏ రూపంలో అయినా బయటకి వస్తుంది. ఒక్కోసారి మన నోటి నుండి వచ్చే ఒక్క చిన్న మాటే అవతలి వాళ్లకి సంజీవిని కావచ్చు.