మంచం మీద కూర్చుని భోజనం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో రోజంతా బద్దకంగా అనిపిస్తుంది.
ఇది మరిన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం వంటి సమస్యలు కనిపిస్తాయి. అది శరీరంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఎప్పుడూ కుర్చీలో నిటారుగా కూర్చుని తినాలి.