ఈ ఏడాది 42 రోజుల పాటు కొనసాగిన దసరా – దీపావళి పండగ సీజనులో వాహనాల రిటైల్ విక్రయాలు 12% పెరిగి 42,88,248 కు చేరినట్లు డీలర్ల సంఘం ఫాడా తెలిపింది.
అంటే సగటున రోజుకు ఒక లక్ష వాహనాలు విక్రయమయ్యాయి. దసరా నవరాత్రులు ప్రారంభమైన రోజు నుంచి ధనత్రయోదశి తర్వాతి 15 రోజుల వరకు కాలాన్ని పండగ సీజనుగా వ్యవహరిస్తారు.