“నిప్పు – అప్పు – పగ
ఈ మూడు వాటంతట అవి తరగవు. పెరుగుతూనే ఉంటాయి. అందుకే
నిప్పును ఆర్పాలి
అప్పును తీర్చేయాలి
పగను సమూలంగా తుంచేయాలి.
వీటిని ఏ మాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతూనే ఉంటాయి.”


“తప్పుల్ని పదే పదే క్షమించడం
మరో పెద్ద తప్పుకు దారి తీస్తుంది.”


సాయం కోరి వస్తే గాయం చేసి పంపకు,
సాయం కాకపోయినా సలహా అయినా ఇవ్వు..
కాలక్రమేణా కొన్నిటిని,
మనం మర్చిపోవచ్చు,
కొన్ని మరుగున పడి,
తీపి జ్ఞాపకాలుగా మార్చుకోవచ్చు,
మనిషి కంటే జ్ఞాపకం ఎప్పుడు మధురమే…


మన వ్యక్తిత్వం,
ఎంత గొప్పది అయినా,
ఒక్కోసారి ఓడిపోవలసి వస్తుంది,
ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో..?
లేక మనం నమ్మే మనుషులదో…?
క్యారెక్టర్ వదిలేయడం అంటే,
ప్రాణాలు వదిలేయడమే…!
చావు రాకముందు చచ్చిపోవడమే..