శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి "ఏష ధర్మః సనాతనః నుండి...  సేకరణ

ఆషాఢమాసం నుండి నాలుగు నెలలపాటు ‘చాతుర్మాస్యం’ అనే పేరుతో దీక్షను పాటించడం సనాతన సంప్రదాయం♪.

సన్యాసులకు, గృహస్థులకు కూడా వారి వారి నియమానుసారం ప్రత్యేక దీక్షలు చెప్పబడ్డాయి.
నారాయణుడు యోగనిద్రలో ఉన్న ఈ సమయంలో అంతర్ముఖమైన అధ్యాత్మ సాధనలకు అనుకూలం.

ఆషాఢం నుండి కార్తికం వరకు వచ్చే అయిదు పూర్ణిమలకు ‘వ్యాసపూర్ణిమ’ లు అనిపేరు. వేదవ్యాసుని స్మరిస్తూ ఆషాఢ పూర్ణిమనాడు ‘గురు పూర్ణిమ’ గా వ్యవహరిస్తారు♪.

భారతీయ సనాతన హైందవ ధర్మానికి ఒక ప్రవక్త అంటూ లేడు♪. ఒక గ్రంథమంటూ లేదు, కానీ వేదాధారంగా విస్తరిల్లిన ఆగమ, పురాణ, ధర్మశాస్త్ర, ఇతిహాసాలన్నిటికీ ఒకేఒక్క కర్తగా ఎవరినైనా చెప్పుకోవలసివస్తే, శ్రీ వేదవ్యాసునే ప్రస్తావించాలి. సమస్త భారతీయ సంస్కృతికీ అతడే జగద్గురువు, సర్వఋషుల వాణినీ సమీకరించి సమర్పించిన ఆచార్యుడు, ద్వాపరయుగాంతంలో అపారమైన వేదరాశిలో ఒకదానిని స్వీకరించి నాలుగువేదాలుగా విభజించి, అష్టాదశపురాణాలను రచించి, ఆపై మహాభారతాన్ని, భాగవతాన్ని రచించి – వివిధ పద్ధతులతో విస్తరిల్లిన సమగ్ర ధర్మాన్ని ఏకత్ర అందించిన నారాయణావతారం విష్ణువు♪. వేదవ్యాసుని అసలుపేరు కృష్ణుడు♪.

సత్యవతీ పరాశరులకు ద్వీపంలో ఉద్భవించినందున ద్వైపాయనుడు అని పేరు♪.
వేదాలను వ్యాసం చేయడం చేత వ్యాసదేవుడు. మన సమస్త ధర్మాలకీ, సాహిత్యాలకీ వ్యాసుడే మూలం, ‘వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం’ – వ్యాసుని ఉచ్ఛిష్టమే ఈ జగతిలోని సమస్త వాఙ్మయము, ప్రపంచానికే జ్ఞానజ్యోతి వ్యాసుడు♪.
లక్షశ్లోకాల మహాభారతం – సర్వశాస్త్ర, సర్వధర్మ సమన్వయ గ్రంథం♪. ఈ గ్రంథం ద్వారా జగద్గురువు అందించిన విజ్ఞానం అపారం♪.
భగవద్గీత, యక్ష ప్రశ్నలు, విష్ణుసహస్రం, శివసహస్రం, వివిధ ఉపాఖ్యానాలు… ఇలా విస్తారమైన విషయాలతో కూడిన అద్భుత సాహిత్య సృష్టి మహాభారతం♪.

యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్||

“ఇక్కడ ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు” అని వ్యాసుడే స్వయంగా భారతం గురించి చెప్పిన మాట.
మానవ నాగరికతకు భారతీయ సంస్కృతి పరీదానమిది♪.

వ్యాసదేవుని గురించి భారతంలో వైశంపాయనుడు (వ్యాసుని శిష్యుడు) స్వయంగా వివరించిన విషయం:

సృష్ట్యారంభంలో బ్రహ్మదేవుని చతుర్ముఖాల నుండి నారాయణుడు వేద విద్యను ప్రసరింపజేశాడు. వాటిని లోకాలలో వ్యాప్తిచేయడానికి విష్ణువే తన అంశతో ఒక తేజస్విని ఆవిర్భవింపజేశాడు. అతని పేరు ‘అపాంతరతముడు’ – ‘లోపలి చీకటిని (అజ్ఞానాన్ని) తొలగించేవాడు♪.’ – విష్ణువుకు ఆత్మజుడు – అని ఖ్యాతిపొందిన ఈ ఘనుడే వివిధ కాలాలలో వివిధ నామాలతో అవతరించి లోకంలో వేదధర్మాన్ని ప్రతిష్ఠించుతాడు♪.

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే।
నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః॥

అని వ్యాసుని వేదనిధియైన విష్ణువుగా ఆరాధించుతాం♪. అపాంతరతముడే ఈ వైవస్వత మన్వంతరంలో పరాశరుని పుత్రునిగా ఉద్భవించాడు. పరాశరుని తండ్రి శక్తి, అతని తండ్రి వసిష్ఠుడు♪.

ఈ పరంపరను తెలియజేస్తూ…

వ్యాసం వాసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్,
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్॥