ముత్తయిదువుల ఏదైనా ఆలయానికి వెళ్ళేటప్పుడు నగలు, పువ్వులు నిండుగా ధరించి వెళ్ళడం మన సాంప్రదాయం.

కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో మాత్రం భక్తులు ఎటువంటి పరిస్థితులలో కూడా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లరు.

వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు పొరపాటున పువ్వులు పెట్టుకుని వెళ్ళిన చెక్ పోస్ట్ దగ్గర, క్యూలైన్లలో పువ్వులను తీసేపిచ్చి స్వామి వారి దర్శనానికి భక్తులను పంపుతారు.

అయితే ఈ విధంగా స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఎందుకు పెట్టుకోకూడదో దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

విష్ణు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అయితే, వెంకటేశ్వరస్వామి పుష్ప అలంకార ప్రియుడు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి కొన్ని వేల రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తుంటారు.

సాధారణంగా శ్రీ రంగాన్ని భోగి మండపం అని, కంచి మండపాన్ని త్యాగ మండపం అంటారు.
అదేవిధంగా తిరుమలను పుష్ప మండపం అని పిలుస్తారు, అందుకోసమే తిరుమలలో పూసే ప్రతి పువ్వు మనుషులకు కాకుండా ఆ భగవంతుడికే సమర్పించాలని అక్కడి ప్రజలు భావిస్తారు.

అందుకోసమే ఇక్కడ మహిళలు లేదా పురుషులు సైతం పువ్వులను ధరించరాదనే నియమం ఉంది.

ఈ క్రమంలోనే తిరుమలకు వెళ్లే భక్తులు కూడా పూలు పెట్టుకోరాదనే నియమం ఉంది. ఈ విషయాన్ని పదే పదే తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులు భక్తులకు గుర్తు చేస్తూ ఉంటారు.
అందుకోసమే తిరుమలకు వెళ్లే భక్తులు ఎవరూ కూడా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లరు. పూర్వ కాలములో తెలియక ఎవరైనా స్త్రీ , పురుషులు తిరుమల కొండ మీద పూవులు పెట్టుకుంటే అక్కడి వానరాలు వెంటనే వచ్చి పూవులను తొలగించే వట.

అంటే అక్కడి వానరాలు సైతం ఇక్కడి పుష్పాలు పెరుమాళ్ కోసమే అనే విషయం చెప్పడం . ఇదంతా తిరుమల మహత్యమే, తిరుమలలో భక్తులు పూలు పెట్టుకోకపోవడానికి అసలు కారణం ఇదే…

సర్వేజనాసుఖినోభవంతు
✍️సేకరణ